: భీమవరంలో దుర్ఘటన... నిర్మాణంలో ఉన్న చర్చి కూలడంతో 25 మందికి గాయాలు


పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్మాణంలో ఉన్న చర్చి కూలడంతో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం చర్చికి శ్లాబ్ వేస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 25 మంది కూలీలు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొంత మంది కూలీలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మన్నా చర్చికి సంబంధించిన నూతన భవనానికి స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News