: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో రేపటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్


పులికాట్ సరస్సుకు వలస వచ్చే పక్షులను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ప్రతి ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపటి నుంచి అక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమ ప్రారంభానికి రాష్ట్ర మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు తదితరులు హాజరవుతున్నారు. ఈ వేడుకలను స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు, ఎల్లుండి జరగనున్న ఈ వేడుకల కోసం ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసిందని ఆ జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు.

  • Loading...

More Telugu News