: నచ్చినోళ్లకు ‘సింహా’... నచ్చనోళ్లకు ‘వీరప్పన్’!


ఆనం వివేకానందరెడ్డి... ఆయన మాట తీరు సెపరేటు.. ఆయన గెటప్ సెపరేటు.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఆ నెల్లూరు నేత ఆయన. మీసకట్టు, పచ్చబొట్టు, ఎడమ చెవికి రింగ్, చలువ కళ్లద్దాలతో దర్శనమిస్తూ.. అందరి దృష్టిని ఆయన ఆకర్షిస్తున్నారు. ప్రజల్లో కలిసిపోయేందుకే తాను పలురకాల గెటప్ లు వేస్తుంటానని తరచుగా చెబుతుండే ‘ఆనం’ దృష్టి ఈసారి 'సింహా' గెటప్ పై పడింది. తెలుగు తమ్ముళ్లకు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఈ గెటప్ ను ఎంచుకున్నట్లు సమాచారం. ఆనం బ్రదర్స్ తమ కార్యకర్తలను కూడా టీడీపీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇటీవల కలిశారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన ఒక సమావేశానికి వివేకానందరెడ్డి ఈ గెటప్ లో అక్కడికి వెళ్లారు. వివేకా గెటప్ నచ్చినోళ్లు ‘సింహా’ అని.. నచ్చనోళ్లు ‘వీరప్పన్’ అని అంటున్నట్లు సమాచారం. కాగా, టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం ‘సింహా’ ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిన విషయమే.

  • Loading...

More Telugu News