: వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి మల్లాది బ్రదర్స్ తరలింపు... మరికాసేపట్లో కోర్టుకు


బెజవాడలో ఐదుగురు దినసరి కూలీలను పొట్టనబెట్టుకున్న కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు... ఆయన సోదరుడు, కృష్ణలంక స్వర్ణ బార్ యజమాని మల్లాది శ్రీనివాస్ లు మరికాసేపట్లో కోర్టుకు రానున్నారు. తమ ఎదుట విచారణకు హాజరైన మల్లాది బ్రదర్స్ ను నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత సిట్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వారిద్దరినీ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగియగానే వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.

  • Loading...

More Telugu News