: సుప్రీం గడప తొక్కిన ‘అమ్మ’ అక్రమాస్తుల కేసు!... ఫిబ్రవరి 2 నుంచి విచారణ
తమిళ జనం ‘అమ్మ’గా ఆరాధించే అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ కేసులో జయను దోషిగా తేల్చిన పరప్పణ అగ్రహార ప్రత్యేక కోర్టు ఆమెకు రూ.100 కోట్ల జరిమానా, నాలుగేళ్ల జైలు శిక్ష విధించడం... దీనిపై జయలలిత కర్ణాటక హైకోర్టుకు వెళ్లడం... ఆ కోర్టు కేసును కొట్టేయడం మనకు తెలిసిందే. హైకోర్టు తీర్పుపై షాక్ తిన్న కర్ణాటక ప్రభుత్వం సదరు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 2 నుంచి ఈ కేసు విచారణను ప్రారంభించనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.