: జింబాబ్వేపై ఆఫ్ఘనిస్థాన్ విజయం...మిన్నంటిన సంబరాలు...వ్యక్తి మృతి


షార్జా వేదికగా జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు విజయం సాధించింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ లో సంబరాలు మిన్నంటాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆనందం పట్టలేని కొంత మంది తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ తూటా టీనేజర్ కు తగిలింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News