: గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం: మర్రి శశిధర్ రెడ్డి


జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయమని, ఇతర పార్టీలకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం చేసిన కుట్రను అడ్డుకున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికలను నిర్వహించాలని కుట్ర చేసిందని ఆయన విమర్శించారు. వార్డు రిజర్వేషన్ల వివరాలు బయటకు రాకుండా చేశారని, ఈ కుట్రను తాము విజయవంతంగా అడ్డుకోగలిగామని మర్రి హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఇవాళ కోర్టులో తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఒక మాటకు, మరొక మాటకు పొంతనలేని విధంగా మాట్లాడారని చెప్పారు. ఏదేమైనా, తాను వేసిన పిల్ ద్వారా రిజర్వేషన్ వివరాలు బయటికి రానున్నాయన్నారు.

  • Loading...

More Telugu News