: ప్రేమజంటకు సహకరించారని ఫిర్యాదు... నలుగురు యువకుల ఆత్మహత్యాయత్నం!


ప్రేమ జంటకు సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. నవాబ్ పేట మండలానికి చెందిన నలుగురు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బాధితులను హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించారు. నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నలుగురు యువకులు ప్రేమ జంటకు సహకరించారని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యువకులను పోలీసులు విచారించారు. మరోసారి విచారణకు రావాలని యువకులకు చెప్పడంతో వారు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా, మెదక్ జిల్లా రాజగోపాల్ పేట పోలీసులు ఈ యువకులను వేధింపుల పాలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

  • Loading...

More Telugu News