: 'తీన్' చిత్రం షూటింగులో అమితాబ్ బచ్చన్ కు స్వల్ప గాయాలు!


బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కు స్వల్ప గాయాలయ్యాయి. అమితాబ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తీన్' చిత్రం షూటింగులో ఆయన గాయపడ్డారు. ఈ విషయాన్ని బిగ్ బీ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. గతరాత్రి జరిగిన షూటింగ్ లో ఈ సంఘటన జరిగిందని, తన పక్కటెముకలకు కొంచెం ఇబ్బంది కల్గిందని పేర్కొన్నారు. వైద్య చికిత్స జరుగుతోందని ..త్వరలోనే నయమవుతుందని తెలిపారు. ఒక విషయం నన్ను బాధిస్తే, మరో విషయంలో మాత్రం తాను సంతోషంగా ఉన్నానని చెప్పారు. అదేమిటంటే, ఈరోజు సాయంత్రం కోల్ కతా లోని సౌత్ సిటీ మాల్ లో 'వజీర్' చిత్రం ట్రయలర్ ను చూడనున్నానని, తన మిత్రులతో పాటు అక్కడికి వెళతానని బిగ్ బీ పేర్కొన్నారు. కాగా, తీన్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోల్ కతాలో జరుగుతోంది.

  • Loading...

More Telugu News