: ఐదేళ్లలో 162 రోజులు బయటే గడిపిన సంజయ్ దత్
అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఫిబ్రవరి 27న జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని సత్ప్రవర్తన రీత్యా 105 రోజుల మందుగానే 'మున్నాభాయ్'కి జైలు నుంచి విముక్తి కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సంజయ్ దత్ జైలు జీవితం గడిపిన ఈ 5 సంవత్సరాల్లో పెరోల్ పేరిట 162 రోజులు బయటనే గడిపాడు. 2013 అక్టోబర్ లో పాదాల నొప్పి పేరుతో చికిత్స కోసం దత్ 28 రోజులు పెరోల్ కింద బయటకు వచ్చాడు. అలాగే అదే సంవత్సరం అనారోగ్యం పేరుతో డిసెంబరులో 90 రోజులు బయటనే ఉన్నాడు. 2014 డిసెంబరులో కుటుంబ సభ్యులతో గడిపేందుకు 14 రోజులు, 2015లో కుమార్తెను చూడాలన్న పేరుతో సంజయ్ మరో 30 రోజులు బయటనే ఉన్నాడు.