: మోదీజీ... పాక్ తో యుద్ధానికి దిగండి... వి.హెచ్.పి, భజరంగ్ దళ్ పిలుపు


భజరంగ్ దళ్, విశ్వహిందూపరిషత్ సంయుక్తంగా ప్రధాని మోదీకి ఒక వినతిపత్రాన్ని సమర్పిస్తూ, పాకిస్తాన్ తో యుద్ధం చేయాలని డిమాండ్ చేశాయి. ఈ రెండు బీజేపీ అనుబంధ సంస్థలు పంజాబ్ లోని పఠాన్ కోట్ లో పాక్ ఉగ్రదాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ , ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో పాకిస్తాన్ ను ఇంకా ఉపేక్షించడం తగదని చెప్పాయి. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఈ రెండు సంస్థలు పఠాన్ కోట్ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేయడమే కాకుండా, ఈ ఘటనలో హతమైన ఆరుగురు పాక్ ఉగ్రవాదులను భారత భూమిలో ఖననం చేయవద్దంటూ జిల్లా మేజిస్ట్రేట్ కు వినతిపత్రం సమర్పించాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వి.హెచ్.పి, భజరంగ్ దళ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.

  • Loading...

More Telugu News