: విక్స్ వేపరబ్ కాళ్లకు రాసుకుంటే జలుబు తగ్గిపోతోంది...నిజమేనా?


వివిధ రుగ్మతలకు 'నమ్మకమే' సరైన వైద్యమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. దీనిని నిజం చేస్తూ ఈ మధ్య 'నెట్ మామ్స్' అనే వెబ్ సైట్ లో విక్స్ వాడకంపై పలువురు ఆసక్తికర అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఆ సంస్థ యాడ్ లో జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లాడి ఛాతి, వీపు భాగంలో విక్స్ వేపరబ్ తో మర్దన చేసిన కాసేపటికే పిల్లాడు ఆడిపాడుతాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ బామ్ పిల్లల కాళ్లకు కూడా తల్లిదండ్రులు రాస్తుంటారు. అలాగే తాము జలుబు, దగ్గు పట్టిపీడిస్తున్నప్పుడు కాళ్లకు రాసుకున్నా ఉపశమనం కలుగుతుందని వారు పేర్కొన్నారు. దీనిపై సైకాలజిస్టులు మాట్లాడుతూ, స్థిరంగా ఓ పని చేస్తున్నామన్న భావన మనిషిని స్థిమితపరుస్తుందని అన్నారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు కాళ్లకు విక్స్ వేపరబ్ రాసుకుంటే తగ్గిపోతుందన్న భావన కూడా అలాంటిదేనని వారు స్పష్టం చేశారు. అలాగే కాళ్లకు రాసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయని విక్స్ వేపరబ్ ను తయారు చేసే ప్రోక్టర్ అండ్ గాంబుల్ సంస్థ కూడా పేర్కొలేదని వారు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News