: ఘనంగా ప్రారంభమైన ‘అల్లు’ జాతీయ పురస్కార ప్రదానోత్సవం
అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్ లోని సత్యసాయి నిగమాగమంలో జరుగుతోంది. ఈ ఏడాది అల్లు జాతీయ పురస్కారాన్ని దర్శకుడు కె.రాఘవేంద్రరావు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. చిరంజీవి కుటుంబసభ్యులు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, హీరో అర్జున్, ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి ఇప్పటికే హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.