: 40 ఏళ్ల అనుభవమున్నా అమితాబ్ నిత్య విద్యార్థి!: ఫరాన్ అఖ్తర్


బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు 40 ఏళ్ల అనుభవం ఉన్నా తనను తాను నిరూపించుకునేందుకు ప్రతి రోజూ ప్రయత్నిస్తారని నట దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ తెలిపాడు. 'వజీర్' సినిమా ప్రమోషన్ లో ఫర్హాన్ మాట్లాడుతూ, అమితాబ్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు నిత్యం పాఠాలు నేర్చుకుంటారని అన్నాడు. ఆయన అద్భుతమైన నటుడని, నటనలో నిరూపించుకునేందుకు ఏమీ లేకపోయినా, ఆయన నిత్య విద్యార్థిగా ఉంటారని పర్హాన్ వెల్లడించాడు. ఆయనలోని ఆ విషయం తనకు స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పిన ఫర్హాన్ అఖ్తర్, తనకు ఆయనే రోల్ మోడల్ అని వివరించాడు. కాగా 'వజీర్'సినిమాలో అమితాబ్ తో కలిసి ఫర్హాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News