: అప్పుడు కూడా గేల్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడు: ఆసీస్ మీడియాతో ఓ మహిళ


వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, గతంలో ఆ జట్టుతో కలిసి పని చేసిన ఓ మహిళ తన అనుభవాన్ని ఆసీస్ మీడియాతో పంచుకుంది. 2015 వన్డే వరల్డ్ కప్ సమయంలో విండీస్ జట్టుతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఓ సారి డ్రెస్సింగ్ రూంలో శాండ్ విచ్ తీసుకునేందుకు వెళ్లానని ఆమె చెప్పారు. ఆ సమయంలో గేల్ తనకు ఎదురు పడ్డాడని, అతని ఒంటిపై కేవలం టవల్ మాత్రమే ఉందని, శాండ్ విచ్ తీసుకునేందుకు వచ్చానని చెప్పగానే టవల్ తీసేసి అభ్యంతరకరంగా మాట్లాడాడని ఆ నాటి సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం జరిగిన ఘటనపై అప్పటి వెస్టిండీస్ జట్టు మేనేజర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ రీచీ రిచర్డ్ సన్ కి వివరించానని, మహిళా సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలని ఆయన దానిపై ఓ సర్క్యులర్ జారీ చేసి ఊరుకున్నారని, కనీసం అందులో గేల్ పేరు కూడా ప్రస్తావించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ సందర్భంగా రాణించిన గేల్ తనను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రెజెంటర్ ను తాగడానికి రావాలని ఆహ్వానించి, విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, కరీబియన్ దీవుల్లోని పర్యాటక ప్రాంతంలో విలాసవంతమైన విల్లా నిర్మించుకున్న గేల్, విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ, తనలా ఎవరైనా జీవించగలరా? అంటూ సహచర ఆటగాళ్లకు సవాలు విసిరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News