: లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుటుంబానికి కేరళ ఆర్థిక సాయం


పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్ర దాడిలో వీరోచితంగా పోరాడి అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ కుటుంబానికి కేరళ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.50 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపింది. మరోవైపు ఇప్పటికే నిరంజన్ కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనకు భార్య రాధిక, రెండేళ్ల కుమార్తె విస్మయ ఉన్నారు. ఆ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది.

  • Loading...

More Telugu News