: పెళ్లి రద్దయిందన్న అవమానంతో కుటుంబం ఆత్మహత్య


పరువు ప్రతిష్ఠలు ఓ కుటుంబం నిండు జీవితాలను బలిగొన్నాయి. వివరాల్లోకి వెళ్తే...రాజస్థాన్ లోని కోట ప్రాంతానికి చెందిన దీక్ష అనే యువతికి జైపూర్ కి చెందిన కమల్ తో నిశ్చితార్థం జరిగింది. వివాహానికి తేదీ కూడా ఖరారు చేసుకున్నారు. పెళ్లి పనులు కూడా పూర్తవుతున్నాయి, ఇక వివాహం జరగడమే తరువాయి. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి డిసెంబర్ 30న దీక్షకు ఫోన్ చేసిన కమల్, ఈ వివాహం జరగదని చెప్పాడు. దీంతో దీక్ష కుటుంబం కమల్ పై కేసు కూడా నమోదు చేసింది. తర్వాత అవమానభారంతో దీక్షతో బాటు ఆమె తల్లిదండ్రులు కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారు మృత్యువాత పడ్డారు.

  • Loading...

More Telugu News