: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో స్వల్ప మార్పులు


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో స్వల్ప మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. మార్పులపై జీహెచ్ఎంసీ చట్టానికి ప్రభుత్వం సవరణ చేసింది. నామినేషన్ పత్రాలలో 7, 8, 10 కాలమ్స్ ను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై పోటీ చేసే అభ్యర్థి వార్డు నంబరు, వార్డు పేరు, ఓటరు జాబితాలో సీరియల్ నంబర్ ను విధిగా నామినేషన్ పత్రాల్లో పేర్కొనాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి కూడా ఓటర్ జాబితాలోని తన పార్ట్ నంబరు, సీరియల్ నంబర్ ను పేర్కొనాలని ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News