: స్వర్ణమయ ప్రహ్లాద మండపంలో బంగారు కాంతుల నడుమ సింహాద్రి అప్పన్న


సింహాద్రి అప్పన్న స్వర్ణకాంతుల మధ్య భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఓ భక్తుడు అప్పన్న స్వామి వారికి స్వర్ణమయ ప్రహ్లాద మండపాన్ని బహూకరించగా, ఈ ఉదయం స్వామివారిని మండపంలో అలంకరించారు. మండపం ఖరీదు రూ. 50 లక్షలని దేవాలయ అధికారులు వెల్లడించారు. విద్యుత్ వెలుగుల మధ్య బంగారు మండపం కాంతులీనుతుండగా, స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. పసిడికాంతుల మధ్య స్వామి మరింత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News