: రిటైర్మెంట్ వార్తలను కొట్టేసిన కెప్టెన్ కూల్.... సమయమొస్తే తప్పుకుంటానని వ్యాఖ్య
టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ... ఆసీస్ పర్యటన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతాడన్న వార్తలు పుకార్లేనట. ఈ మేరకు నిన్న ఆసీస్ పర్యటనకు బయలుదేరే ముందు ముంబైలో స్వయంగా మహీనే రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేశాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని అతడు పేర్కొన్నాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఆసీస్ టూర్, టీ20 వరల్డ్ కప్ పైనేనని అతడు ప్రకటించాడు. అయితే సమయమొచ్చినప్పుడు మాత్రం పొట్టి క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటానని ధోనీ స్పష్టం చేశాడు.