: బీజేపీలోకి ‘తలై’!... జాతీయ పార్టీ పిలుపునకు తమిళ స్టార్ గ్రీన్ సిగ్నల్
తమిళనాట మరో స్టార్ హీరో రాజకీయ తెరంగేట్రం చేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలోనూ సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తమిళ నాట సినీ అభిమానులు ‘తలై’గా పిలుచుకునే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ను పార్టీలోకి తీసుకురావాలన్న అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చేసిన యత్నాలు దాదాపుగా ఫలించాయనే వాదన వినిపిస్తోంది. తమ పార్టీలోకి రావాలన్న బీజేపీ నేతల వినతికి అజిత్ కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన కమల దళంలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.