: గాడినపడ్డ ఆమ్లా...డబుల్ సెంచరీ నమోదు
ఢిల్లీ టెస్టు తన కెరీర్ లో అత్యంత చెత్త టెస్టు అని పేర్కొన్న సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ హషీమ్ ఆమ్లా గాడినపడ్డాడు. గత ఏడాది కాలంగా ఫాం లేమితో ఇబ్బంది పడుతున్న ఆమ్లా డబుల్ సెంచరీతో సత్తాచాటాడు. దీంతో టెస్టు కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తూ పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడంటూ అపప్రధను మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో జూలు విదిల్చాడు. కేప్ టౌన్ లో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 626 పరుగులు చేసి డిక్లేర్ చేసిన ఇంగ్లండ్ జట్టుకు దీటైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఆమ్లా డబుల్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ రాణించడంతో రెండో టెస్టులో మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా జట్టు 428 పరుగులు సాధించింది. ఆమ్లాకు జతగా డుప్లెసిస్ 88 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో రెండో టెస్టు రసవత్తరంగా మారింది.