: శబరిమలలో తెలంగాణ భవన్ పై రేపు అవగాహనా ఒప్పందం
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణం కోసం రేపు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రేపు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర అధికారులు రేపు కేరళకు వెళుతున్నారు. శబరిమలలో తెలంగాణ భవన్ ఏర్పాటు నిమిత్తం కేరళ ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల్లో తెలంగాణ రాష్ట్ర యాత్రికుల కోసం ఈ భవనం నిర్మించనున్నారు. తెలంగాణ భవన్ నిర్మాణం జరిగితే ఈ రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్లే యాత్రికులకు బస విషయమై ఇకపై ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు పేర్కొన్నారు.