: పాకిస్థాన్ జెండాకి చెప్పుల సన్మానం
ముంబై, జలంధర్, భువనేశ్వర్ లు పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు, భారత భద్రతా దళాలకు జేజేలతో హోరెత్తాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఉగ్రదాడి ముగియడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాకిస్థాన్ పై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. పాకిస్థాన్ జాతీయ జెండాకు చెప్పులతో సన్మానం చేశారు. కాగా, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి దిగిన ఆత్మాహుతి దళాన్ని భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.