: ఘనంగా మయన్మార్ స్వాతంత్ర్య వేడుకలు
మయన్మార్ 68వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా యాంగాన్ లో సైనికులు చారిత్రాత్మకమైన ష్వెడగాన్ పగోడా (ఆలయం) ఎదుట కవాతు చేశారు. రాజధాని నైపెడ్యాలో స్వాతంత్ర్య వేడుకలను సరికొత్తగా నిర్వహించారు. రాటెన్ బాస్కెట్స్ తలల మీద పెట్టుకొని అవి కిందకు పడిపోకుండా ఎక్కువ దూరం నడిచిన మహిళలను విజేతలుగా ప్రకటించారు. చిన్న పిల్లలకు వివిధ రకాల ఆటలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.