: ముగిసిన ఏబీ బర్దన్ అంత్యక్రియలు


సీపీఐ అగ్రనేత ఏబీ బర్దన్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగంబోధ్ లో ముగిశాయి. కమ్యూనిస్టు పద్ధతిలో బర్ధన్ కు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన అంత్యక్రియలకు వామపక్ష నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతకుముందు జీబీ పంత్ ఆసుపత్రి నుంచి తీసుకొచ్చి పార్టీ ప్రధాన కార్యాలయం అజయ్ భవన్ లో ఉంచారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు బర్దన్ కు నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News