: ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ...లోథా కమిటీ సిఫార్సు
బీసీసీఐను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని జస్టిస్ లోథా సిఫారసు చేశారు. బీసీసీఐ రాజ్యాంగం, పద్ధతులు, పనితీరుపై అధ్యయనం చేసిన లోథా కమిటీ ఈ మేరకు రూపొందించిన తుది నివేదికను ఇవాళ సుప్రీంకోర్టు, బీసీసీఐకి సమర్పించింది. ఈ నివేదికలో పై సిఫారసు చేసింది. ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుందర్ రామన్ కు క్లీన్ చిట్ ను ఇవ్వడంతో పాటు ఒక రాష్ట్రానికి ఒక క్రికెట్ అసోసియేషన్ ఉండాలనే సిఫారసులు కూడా ఈ కమిటీ చేసింది.