: రఘువీరాపై బోండా ఉమ ఆగ్రహం!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరాపై టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే హక్కు రఘువీరా రెడ్డికి లేదని అన్నారు. జన్మభూమి కమిటీల్లో అవినీతి జరిగితే నిరూపించాలని అన్నారు. మల్లాది విష్ణును పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదో రఘువీరా చెప్పాలని ఉమ ప్రశ్నించారు. కాగా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబుపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు తాజాగా విమర్శలు గుప్పించారు. వాళ్లిద్దరూ పరస్పరం పొగుడుకోవడానికే సమయం అయిపోతోందని, ఇంకా రాష్ట్రభివృద్ధి గురించి వారేమి ఆలోచిస్తారని రఘువీరా విమర్శించిన విషయం తెలిసిందే.