: పఠాన్ కోట్ ఘటన కారణంగా చైనా పర్యటన రద్దు చేసుకున్న అజిత్ దోవల్


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఆపరేషన్ ముగియకపోవడంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా వివిధ అంశాలపై చర్చలు జరిపేందుకు అజిత్ దోవల్ రేపు చైనా బయల్దేరాల్సి ఉంది. ఈ పర్యటన సందర్భంగా రేపు బీజింగ్ లో చర్చలు జరపాల్సి ఉంది. బుధవారం చైనా ప్రధాని లీ కెకియాంగ్ తో సమావేశం కావాల్సి ఉంది. తాజా ఘటన నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన మరోసారి చైనా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News