: టెన్త్, ప్లస్ టూ పరీక్షల తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ
ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదవ తరగతి, 12వ తరగతి (ప్లస్ టూ) చదువుతున్న వారికి పరీక్షల నిర్వహణా తేదీలను సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) వెల్లడించింది. పదవ తరగతి పరీక్షలు మార్చి 1న ప్రారంభమై 28 వరకూ జరుగుతాయని, ప్లస్ టూ పరీక్షలు కూడా మార్చి 1నే ప్రారంభమై ఏప్రిల్ 22 వరకూ జరుగుతాయని తెలిపింది. టెన్త్ విద్యార్థులకు మార్చి 2న సైన్స్, 10న సోషల్, 15న ఇంగ్లీష్, 19న మ్యాథ్స్ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ప్లస్ టూ విద్యార్థులకు మార్చి 1న ఇంగ్లీష్, 3న బిజినెస్ స్టడీస్, 5న ఫిజిక్స్, 8న హిస్టరీ, 9న కెమిస్ట్రీ, 14న మ్యాథ్స్ పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. 17న అకౌంట్స్, 18న పొలిటికల్ సైన్స్, 21న బయోలజీ, 31న ఎకనామిక్స్, ఏప్రిల్ 7న జియోగ్రఫీ, 16న ఫిలాసఫీ ఉంటాయని వెల్లడించింది. మొత్తం 15 లక్షల మంది టెన్త్ పరీక్షలకు, 12 లక్షల మంది ప్లస్ టూ పరీక్షలకు హాజరవుతారని ఇండియాలోని అతిపెద్ద ఎడ్యుకేషనల్ బోర్డు సీబీఎస్ఈ వెల్లడించింది.