: ఇకపై పూర్తి పేరు రాస్తేనే రైల్వే రిజర్వేషన్


ఇకపై రైల్లో సీటు లేదా బెర్త్ రిజర్వ్ చేయించుకోవాలంటే పూర్తి పేరును రిజర్వేషన్ ఫారమ్ లో రాయాల్సిందే. ఇంటిపేరు, వ్యక్తి పేరు, పూర్తి చిరునామా, మొబైల్ నంబర్ తప్పనిసరి. హడావుడిలో ఇనీషియల్స్ వాడుతూ పేరు రాయడం, ఇంటి పేరులో మొదటి అక్షరం పేర్కొనడం, పేరు రెండు భాగాలుగా ఉంటే మరో ఇనీషియల్ రాయడం... చేస్తే కనుక ఇకపై టికెట్ లభించదు. ఈ మేరకు భారతీయ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను తక్షణం అమలు చేయాలని సూచించింది. కాగా, ప్రస్తుతం నిత్యమూ 2,500కు పైగా రైళ్లలో 15 లక్షల నుంచి 22 లక్షల మంది ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News