: రజనీకాంత్ నన్ను విలన్ గా నటించొద్దన్నారు: అమితాబ్ బచ్చన్
సూపర్ స్టార్ రజనీ కాంత్ చిత్రం రోబో 2.0లో విలన్ పాత్ర కోసం దర్శకుడు శంకర్ తనను సంప్రదించారని అమితాబ్ పేర్కొన్నారు. ఒక తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దర్శకుడు అడిగినప్పటికీ, ఈ పాత్రలో తనను నటించొద్దని రజనీకాంత్ సూచించారని.. అందుకే ఈ పాత్రలో నటించడానికి తాను ఒప్పుకోలేదని అమితాబ్ చెప్పారు. కాగా, ఈ పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.