: మళ్లీ మాట నిలబెట్టుకున్న సల్మాన్


మాట నిలబెట్టుకోవడంలో తన తర్వాతే ఎవరైనా అని సల్మాన్ ఖాన్ మరోసారి రుజువు చేసుకున్నాడు. గతంలో ఎంతో మందికి ఈవిధంగా మాటిచ్చి, వారిని వెండితెరకు పరిచయం చేసిన సల్లూ భాయ్ తాజాగా తన బాడీగార్డ్ కుమారుడికి అలాంటి అవకాశాన్ని కల్పించాడు. షేర అనే వ్యక్తి తనకు దశాబ్దానికి పైగా బాడీగార్డ్ గా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు టైగర్ చదువు ఇటీవలే పూర్తయింది. తన తాజా చిత్రం సుల్తాన్ లో సహాయ దర్శకుడిగా పనిచేసేందుకు టైగర్ కు సల్మాన్ అవకాశం కల్పించాడు. సహాయ దర్శకుడిగా టైగర్ నిరూపించుకుంటే, నటుడిగా కూడా అతనికి అవకాశం లభిస్తుందన్న ఆశాభావాన్ని షేర వ్యక్తం చేశాడు. తన బాడీగార్డ్ కుమారుడికి ఈ అవకాశం కల్పిస్తానని గతంలో 'బాడీగార్డ్' చిత్రం ప్రచార సమయంలో సల్మాన్ ప్రామిస్ చేశాడు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నాడు.అదీ సంగతి!

  • Loading...

More Telugu News