: పటాన్ కోట్ ఉగ్రదాడిపై స్పందించిన అమెరికా!


పటాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. దీన్నో దుర్మార్గపు చర్యగా అభివర్ణించింది. ఈ మేరకు యూఎస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఓ ప్రకటన వెలువరించారు. "బాధితులకు, వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఉగ్రవాదంపై పోరులో భారత ప్రభుత్వానికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఉపఖండంలోని దేశాలన్నీ కలసికట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, దాదాపు 15 గంటల పాటు ఉగ్రవాదులతో సాగిన పోరు అనంతరం, భారత భద్రతా దళాలు నలుగురు తీవ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కామన్వెల్త్ చాంపియన్, షార్ప్ షూటర్ సుబేదార్ మేజర్ ఫతే సింగ్ సహా మరో సైనికుడు వీర మరణం పొందారు.

  • Loading...

More Telugu News