: సుపరిపాలనకు అధునాతన సాంకేతిక వినియోగం: నరేంద్ర మోదీ


ప్రజలందరికీ సుపరిపాలనను అందించే దిశగా అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కర్ణాటకలోని మైసూరులో 103వ భారతీయ విజ్ఞాన సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ తరహా విజ్ఞాన సదస్సును ప్రారంభించడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని, పలువురు గొప్ప నేతలను అందించిన ఘనత మైసూరు విశ్వవిద్యాలయానికి ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా శాస్త్రవేత్తలు తమ మెదడుకు పని పెంచాలని కోరారు. "కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చాం. ఆహారం, ఆరోగ్యం తదితరాల ప్రమాణాలు మెరుగుపర్చడంలో సఫలమయ్యామని గర్వంగా చెప్పగలం. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌, మైసూరు విశ్వవిద్యాలయం ఒకేసారి ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల తరుణంలో విజ్ఞాన సదస్సు నిర్వహించడం సంతోషదాయకం. అధునాతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోనే సుపరిపాలన సాధ్యం" అని మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే 15 ఏళ్లలో ఇండియాలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా కృషి చేస్తామని వివరించారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రి హర్షవర్ధన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఇండియాతో పాటు వివిధ దేశాలకు చెందిన 10 వేల మందికి పైగా శాస్త్రవేత్తలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News