: తెహ్రాన్ లోని సౌదీ ఎంబసీపై దాడి
సౌదీ అరేబియాలో ఓ ముస్లిం మత గురువును ఉరి వేసి చంపడంపై ఆగ్రహంతో తెహ్రాన్ లోని ఆ దేశ ఎంబసీపై ఆందోళనకారులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. సౌదీలో నిమ్ర్ అల్ నిమ్ర్ (56)ను ఉరితీసినట్టు ప్రకటించిన గంటల వ్యవధిలో ఈ దాడి జరిగింది. సున్నీ వర్గం సామ్రాజ్యంగా ఉన్న సౌదీ, అన్యాయంగా ఆరోపణలు మోపి, షియా నేతను హతమార్చిందని ఆందోళనకారులు ఆరోపించారు. కాగా, నిమ్ర్ ఉరిపై ఇరాన్, ఇరాక్ తదితర దేశాల్లో సైతం ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. సౌదీ ప్రభుత్వం ఉగ్రవాదులకు మద్దతిస్తోందని ఇరాన్ షియా వర్గాలు విమర్శించాయి. దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.