: ఉగ్రవాదుల సంఖ్యపై ట్వీటు జారి నాలిక్కరుచుకున్న రాజ్ నాథ్ సింగ్!
నిన్న పఠాన్ కోట్ లో ఉగ్రదాడి అనంతరం జవాన్లను అభినందిస్తూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్ ను ఉపసంహరించుకున్నారు. తొలుత "భద్రతాదళాలు విజయవంతంగా ఆపరేషన్ ను పూర్తి చేశాయి. నేను సైనికులను అభినందిస్తున్నాను. పఠాన్ కోట్ ఆపరేషన్ లో ఐదురుగు టెర్రరిస్టులు మరణించారు" అని ట్వీటిన ఆయన, ఆపై కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. వాస్తవానికి ఈ ఆపరేషన్ లో మరణించింది నలుగురు ఉగ్రవాదులే. హోం మంత్రి ఐదుగురని పేర్కొనడంతో, అప్పటివరకూ నలుగురు ఉగ్రవాదులు మరణించారని వార్తలు చెబుతూ వచ్చిన మీడియా, ఆపై ఐదుగురని పేర్కొంది. ఆపై కాసేపటికి రాజ్ నాథ్ తన ట్వీట్ ను వెనక్కు తీసుకున్నారు.