: ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు అజహరుద్దీన్ ను దించుతున్న కాంగ్రెస్!
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంను దెబ్బకొట్టి పాతబస్తీలో కొన్ని స్థానాలు సంపాదించాలంటే, ఆకర్షణీయ ముస్లిం నేత ఉండాలని భావిస్తున్న కాంగ్రెస్, పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ ను సంప్రదించింది. ఆయన్ను పోటీలో దింపేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలో అజహరుద్దీన్ కు మంచి హోదా, యువతలో ఫాలోయింగ్ ఉండటాన్ని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ ఈ ఎత్తు వేసినట్టు తెలుస్తోంది. తన ముందుకు వచ్చిన మేయర్ ప్రతిపాదనపై అజర్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కొంత ఆలోచించి చెబుతానని కాంగ్రెస్ నేతలతో అన్నట్టు సమాచారం.