: వీళ్లిద్దరూ వ్యసనం లాంటి వారు: నందినీ రెడ్డి


సినీ నటుడు నాగశౌర్య, నటి మాళవిక (ఎవడే సుబ్రమణ్యం ఫేం) వ్యసనంలాంటి వారని దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపింది. 'కళ్యాణ వైభోగమే' సినిమా ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, వీరిద్దరితో ఓసారి సినిమా చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుందని తెలిపింది. వారితో మళ్లీ ఓ సినిమా చేస్తానని చెప్పింది. వయసులో చిన్నవారైనా వారి నటన ఎంతో అనుభవమున్నవారిలా ఉంటుందని తెలిపింది. హావభావాలు ప్రదర్శించడంలో ఇద్దరికి ఇద్దరూ మేటి అని పేర్కొంది. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని, సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపింది. సినిమాకు పని చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పింది. సినిమాకు కళ్యాణ్ కోడూరి అద్భుతమైన పాటలు అందించాడని నందినీ రెడ్డి చెప్పింది.

  • Loading...

More Telugu News