: సీపీఐ అగ్రనేత ఏబీ బర్దన్ కన్నుమూత


సీపీఐ పార్టీ కోసం సర్వం ధారపోసిన సీనియర్ నేత ఏబీ బర్దన్ (91) కన్నుమూశారు. బంగ్లాదేశ్ లోని బరిసోల్ లో 1924 సెప్టెంబర్ 24న జన్మించిన బర్దన్, 1957లో మహారాష్ట్ర శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. విద్యార్థి సంఘాల నేత స్థాయి నుంచి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్ లో వామపక్ష పార్టీలు ఐక్యమవ్వడంలో కీలక పాత్ర పోషించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బర్దన్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఆ పార్టీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News