: దేశభద్రతపై ముగిసిన కీలక సమావేశం


దేశ భధ్రతపై రక్షణ శాఖ కార్యాలయంలో కీలక సమావేశం ముగిసింది. పంజాబ్ లోని పఠాన్ కోట్ లోని ఎయిర్ బేస్ పై పాక్ ముష్కరులు దాడులకు దిగడంతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిపై కీలక చర్చ జరిగింది. పంజాబ్, జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో భద్రతపై చర్చించారు. ఉగ్రదాడి జరిగిన తీరుతెన్నులపై ఆరాతీశారు. ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన తీవ్రవాదులుగా గుర్తించారు. చివరి క్షణాల్లో వారు కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు భద్రతా దళాలు గుర్తించాయి. తాజా ఘటన నేపథ్యంలో ఎలాంటి అనర్థం చోటు చేసుకోకుండా ఉండేందుకు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను పెంచారు.

  • Loading...

More Telugu News