: తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖలో కొలువుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం
తెలంగాణలో కొలువుల జాతర సాగుతోంది. టీఎస్ పీఎస్సీ ద్వారా వివిధ రంగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రూప్ 2 పోస్టులు, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా వైద్య శాఖలో కొలువుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 92 అర్బన్ హెల్త్ సెంటర్లను పట్టణ పీహెచ్ సీలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటుకు మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వైద్య శాఖను పటిష్ఠం చేయాలని తీర్మానించారు. దీంతో పాటు స్ట్రీట్ వెండర్లకు చట్టబద్ధత కల్పించడం, జీహెచ్ఎంసీలో ఆస్తి పన్ను, విద్యుత్, నల్లా బకాయిల మాఫీ, నాలా ఛార్జీల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.