: గ్యాస్ వినియోగదారుల ఏడాదిగా 2016
గ్యాస్ వినియోగదారుల ఏడాదిగా 2016వ సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, 2018 లోపు దేశంలోని వినియోగదారులందరికీ సురక్షిత గ్యాస్ ఇంధనాన్ని అందించడం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వినియోగదారులందరికీ పారదర్శక సిలిండర్లు అందిస్తామన్నారు. ఆన్ లైన్ లో గ్యాస్ బిల్లులు చెల్లించేలా ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తున్నట్లు ధర్మేంద్రప్రధాన్ పేర్కొన్నారు.