: ‘కాంగ్రెస్’ సింగిల్ డిజిట్ కూడా దాటదు: కేటీఆర్
హైదరాబాద్ లో ఫీల్ గుడ్ వాతావరణం ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తమకు వ్యతిరేకంగా అందరూ ఏకమవుతున్నారంటే, టీఆర్ఎస్ బలం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కేసీఆర్ పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కూడా దాటదని, బీజేపీ విషయానికొస్తే.. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించలేదని అన్నారు. కాగా, త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో టిఆర్ఎస్ ప్రచార పోస్టర్లు ఇప్పటికే దర్శనమిస్తున్నాయి. పోస్టర్ల ద్వారా వారి ప్రచారం జోరు అందుకుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పాటు మిగిలిన పార్టీలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.