: ఇండియా ఆసక్తిగా చూస్తోందన్న కేజ్రీవాల్!


కాలుష్య రహిత భారతావనికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మార్గం చూపుతోందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రెండు వారాల పాటు తాము ప్రవేశపెట్టిన నిబంధనను కచ్చితంగా పాటించాలని ఢిల్లీ వాసులను ఆయన కోరారు. "ఢిల్లీ వైపు ఇండియా మొత్తం ఆసక్తిగా చూస్తోంది. గతంలో ఇటువంటి నిర్ణయం ఎక్కడా అమలు కాలేదు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. నాకు ఒక్క సరిసంఖ్య ఉన్న పాసింజర్ వాహనం కూడా కనిపించలేదు. నాకు అందుతున్న సమాచారం ప్రకారం మా ప్లాన్ విజయవంతమైనట్టే" అని ఆయన అన్నారు. కాగా, రూ. 2 వేలు ఫైన్ చెల్లించే కంటే, ఓ టాక్సీ బుక్ చేసుకుని వెళ్లవచ్చని భావిస్తున్నట్టు అత్యధికులు వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News