: ఎస్ఆర్ నగర్ హాస్టల్ యువతిని నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్


తన సెల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఓ యువతిని మభ్యపెట్టి, ముగ్గులోకి దించి మోసం చేశాడో కానిస్టేబుల్. బిడ్డ పుట్టాక నువ్వెవరో తెలీదని అతడిచ్చిన సమాధానంతో ఆమె, రైలు పట్టాలపై పడుకోగా, పోలీసులకు విషయం తెలిసి ఆమె ప్రాణాలు కాపాడారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, వరంగల్ ప్రాంతానికి చెందిన నిరోష 2014లో హైదరాబాద్ కు వచ్చి ఎస్ఆర్ నగర్ లోని ఓ హాస్టల్ లో చేరింది. తన సెల్ ఫోన్ పోవడంతో పోలీసు స్టేషన్ కు వెళ్లింది. అక్కడే కానిస్టేబుల్ రాజారాం ఆమెకు పరిచయం అయ్యాడు. అప్పటికే పెళ్లయిన అతను, విషయాన్ని దాచి నిరోషకు దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి రహస్యంగా వివాహం చేసుకుని యూసఫ్ గూడలో కాపురం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరికీ కొడుకు పుట్టాడు. ఆపై రాజారాం ఇంటికి రావడం మానేశాడు. స్టేషనుకు వెళ్లి అడిగితే, సంబంధం లేదని, నిరోష ఎవరో తెలియదని చెప్పాడు. దీంతో మనస్తాపంతో నిరోష, తన బిడ్డతో కలిసి రైలు పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, కేసు దర్యాఫ్తు మొదలైంది.

  • Loading...

More Telugu News