: భారత వైవాహిక బంధం గొప్పదనాన్ని చాటిన సౌదీ అబ్బాయి, రష్యా అమ్మాయి


యువకుడు పుట్టింది, పెరిగింది గట్టి కట్టుబాట్లు కలిగిన ముస్లిం దేశం సౌదీ అరేబియాలో. యువతి పుట్టి పెరిగింది నమ్మిన సిద్ధాంతాలకు ప్రాణాలిచ్చే కమ్యూనిస్టు దేశం రష్యాలో. వీరిద్దరికీ భారత్ తో ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వీరు భారతీయ హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుని భారతీయ సంప్రదాయ వైవాహిక గొప్పదనాన్ని ఓ మెట్టు ఎక్కించారు. వివరాల్లోకి వెళ్తే... సౌదీ అరేబియాకు చెందిన హమీద్ అల్ హమద్ చైనాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. అక్కడే రష్యాకు చెందిన జులియానా స్మిర్నాఫ్ వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరికి ఉన్నత విద్య కోసం చైనా వెళ్లిన గుజరాత్ లోని సూరత్ కు చెందిన కిషన్ ధోలియా పరిచయమయ్యాడు. వారి స్నేహం పెరగడంతో కిషన్ వివాహానికి భారత్ కు వచ్చారు. ఈ సందర్భంగా పండితులు చదివే మంత్రాల అర్థం అడిగి తెలుసుకున్నారు. పెళ్లి తంతు మొత్తం గ్రహించారు. తమకు ఇలాంటి గొప్ప పద్ధతి కావాలని భావించి, స్నేహితుడి సహకారంతో బుధవారం సూరత్ లో పూర్తి భారతీయ హిందూ సంప్రదాయ పద్ధతిలో మూడుముళ్ల బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యారు.

  • Loading...

More Telugu News