: పాక్ సింగర్ ను వెనక్కి పంపిన శంషాబాద్ విమానాశ్రయాధికారులు
పాకిస్థాన్ కు చెందిన సింగర్ ను హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాధికారులు పాకిస్థాన్ కు తిప్పిపంపారు. హైదరాబాదులోని నూతన సంవత్సర వేడుకల్లో పాలుపంచుకునేందుకు పాకిస్థాన్ నుంచి హైదరాబాదులోని శంషాబాదు విమానాశ్రయానికి చేరుకున్న ఆ దేశ సింగర్ రహత్ అలీఖాన్ అనే సింగర్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పిపంపారు. అయితే అతనిని తిప్పిపంపడానికి గల కారణాలను వారు వెల్లడించలేదు. కాగా, రహత్ అలీ ఖాన్ హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరగనున్న నూతన సంవత్సర వేడుకల్లో గానం చేయాల్సి ఉంది.