: నా రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు!: చంద్రబాబు


‘నా రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు’ అని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. కాల్ మనీ వ్యవహారంపై ఇటీవల అసెంబ్లీలో జరిగిన రాద్ధాంతం, వైఎస్సార్సీపి నేతలు ప్రవర్తించిన తీరుపై తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడారు. ఆ పార్టీ పుట్టుక, దాని విధానం, అందులో ఉన్న వ్యక్తులు.. ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని దోచుకోవడానికేనని ఆరోపించారు. ఎక్కడా చోటులేని వాళ్లు, సమాజాన్ని అతలాకుతలం చేసేవాళ్లు అటువంటి పార్టీలో చేరతారు. రాష్ట్రంలో కాల్ మనీ నిందితులపై రైడ్ చేస్తే మెజారిటీ వ్యక్తులు వైఎస్సార్సీపికి చెందినవారేనన్నారు. కాల్ మనీ పై ఫిర్యాదు ఇచ్చింది వైఎస్సార్సీపీ కాదు... ఒక మహిళ పోలీసులకు కంప్లంట్ చేస్తే పోలీసులను రంగంలోకి దిగమని ఆదేశించింది తానేనని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News