: మరోసారి నైజం నిరూపించుకున్న ఐఎస్ఐఎస్
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు క్రూరత్వం నిరూపించుకున్నారు. ఇస్లాం ముసుగులో దారుణాలకు పాల్పడుతున్న ఐఎస్ తీవ్రవాదులు మరోసారి తమ అసలు రంగు చూపించారు. తమ చెరలోని సెక్స్ బానిసలుగా బతుకుతున్న యాజాదీ స్త్రీలను విడిపించేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణపై ఒక వ్యక్తిని శిరశ్ఛేదం చేశారు. 2014 ఆగస్టులో ఉత్తర ఇరాక్ లోని సిజార్ పట్టణంపై దాడి చేసిన ఐఎస్ఎస్ తీవ్రవాదులు వేలాది మంది యాజాదీ తెగల మహిళలను మోసూల్ కు తరలించారు. వారిపై విశృంఖల లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వీరి క్రూరత్వాన్ని సహించలేకపోయిన అబ్దుల్లా అల్ బౌజర్ అనే వ్యక్తి యాజాదీ తెగకు చెందిన స్త్రీలను రక్షించి తరలించే క్రమంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు దొరికిపోయాడు. దీంతో తమ విధానాలకు భంగం కలిగించేవారికి విధించే శిరశ్ఛేదన శిక్షను అల్ బౌజర్ కు విధించారు. అతనిని మోసూల్ పట్టణంలోని ప్రధాన కూడలికి తీసుకుని వచ్చి బహిరంగంగా శిరశ్ఛేదం చేశారు.